భూమన ఇంటి ముట్టడికి హిందూ సంఘాలు, సాధువుల యత్నం.. తిరుపతిలో ఉద్రిక్తత

  • భూమనను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు, సాధువుల డిమాండ్
  • నిరసనకారులను మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు
  • తిరుమలను భూమన రాజకీయాలకు వాడుకుంటున్నారన్న ప్రముఖ సాధువు

తిరుపతిలోని శిల్పారామం సమీపంలో భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ప్రతినిధులు, సాధువులు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను మధ్యలోనే అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ శాంతియుత నిరసనను అడ్డుకోవడంపై హిందూ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ఒక ప్రముఖ సాధువు మాట్లాడుతూ... తిరుమల అనేది రాజకీయాలకు అతీతమైన పరమ పవిత్ర క్షేత్రమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని గుర్తుచేశారు. అదృష్టం కొద్దీ రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ, భూమన శ్రీవారి సేవను విస్మరించి తిరుమలను రాజకీయం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన చేసిన తప్పులకు గానూ వేంకటేశ్వరస్వామికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, సాధువులు రోడ్డుపైకి వస్తే దాడి చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్ర పన్నాయని హిందూ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.



Bhumana Karunakar Reddy
TTD
Tirumala
Hindu organizations
protest
Tirupati
YSRCP
Sadhuvulu
Tirumala sanctity
Andhra Pradesh Politics

More Telugu News